News March 4, 2025
ధర్మపురి: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

ధర్మపురి మండలం గాదెపల్లిలో రెండు బైకులు ఢీకొని ఒకరు స్పాట్‌లోనే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా రెండు బైకులు వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2025
ADB: ఈ నెల 23 నుంచి రెండో విడత కరెక్షన్

ఆదిలాబాద్ జిల్లాలోని రెసిడెన్షియల్, కేజీబీవీ, ఆదర్శ, ప్రైవేట్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న వృక్షశాస్త్రం,జంతుశాస్త్ర అధ్యాపకులు ఇంటర్మీడియట్ రెండో విడత మూల్యాంకనంలో పాల్గొనాలని DIEO జాధవ్ గణేశ్ సూచించారు. ఈ నెల 23న జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఈ నెల 24 భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం మూల్యంకనం జరుగుతుందన్నారు. అధ్యాపకులు రిపోర్ట్ చేయాలని కోరారు.
News March 22, 2025
జనగామ: 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి: కలెక్టర్

రబీ సీజన్ 2024-25కి సంబంధించి ధాన్యం కొనుగోలుపై శనివారం జనగామ కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సమావేశం నిర్వహించారు. మొత్తం 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేయగా, అందులో 2,35,954 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో 62,013 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, దొడ్డు రకం 1,73,941 మెట్రిక్ టన్నులు సేకరించాలని అంచనా వేశామని చెప్పారు.
News March 22, 2025
KMR: స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలి: కలెక్టర్

స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం అమలు కోసం జిల్లా మల్టీ మెంబర్ అథారిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిజిష్టర్‌ల నిర్వహణ పకడ్బందీగా ఉండేట్లు చూడాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా జడ్జి వర ప్రసాద్ ఉన్నారు.