News August 12, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.3,39,377 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,66,512, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,38,000, అన్నదానం రూ.34,865, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News September 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు తప్పని నిరీక్షణ!

image

కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా మోక్షం కలగడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం నిలిచిపోయిన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నేటికీ పునరుద్ధరించుకోలేదు. ఆహార భద్రతతో పాటు సంక్షేమ పథకాలకు ఈ కార్డే కీలకం కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తోందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

News September 15, 2024

ఉమ్మడి KNR జిల్లాలో పాఠశాలల వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఈ విధంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 784 పాఠశాలల్లో 98,240 విద్యార్థులు, కరీంనగర్ జిల్లాలో 1,071 పాఠశాలల్లో 1,57,648 విద్యార్థులు, జగిత్యాల జిల్లాలో 1,165 పాఠశాలల్లో 1,59,585 విద్యార్థులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 659 పాఠశాలల్లో 87,390 విద్యార్థులు ఉన్నారు.

News September 15, 2024

KNR: ట్రైన్‌పై రీల్స్.. విద్యుత్ వైర్లు తాకి గాయాలు

image

రైలు పైకి ఎక్కి రీల్స్ చేస్తుండగా హైటెన్షన్ వైర్లు తాకి యువకుడు గాయాలపాలైన ఘటన WGL జిల్లా కాజీపేటలో శనివారం జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. KNR జిల్లా హుజురాబాద్‌కు చెందిన రాజ్ కుమార్(18) కడిపికొండ దగ్గరలో గల రాంనగర్ సమీప రైల్వే ట్రాక్‌పై ఆగిఉన్న గూడ్స్ రైలుపై సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తాకడంతో 70% శరీరం కాలిపోయింది. MGMలో చికిత్స అందిస్తున్నారు.