News August 14, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,23,427 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.50,261, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.59,930, అన్నదానం రూ.13,236, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News July 8, 2025

పోలీసుల ప్రతిభను గుర్తించడానికే ఈ పోటీలు: KNR సీపీ

image

KNR పోలీస్ కమీషనరేట్ కేంద్రంగా రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు ఈ ‘పోలీసు డ్యూటీ మీట్’ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ పేర్కొన్నారు. నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత, నైపుణ్యం కనబరిచే విధంగా ఈ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

News July 8, 2025

చేప పిల్లల ఉత్పత్తిలో కరీంనగర్ ప్రథమం: మంత్రులు

image

కరీంనగర్ ఉజ్వల పార్క్ సమీపంలోని చేప పిల్లల పెంపక కేంద్రాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సోమవారం సందర్శించారు. జిల్లాలో చేపల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని, రాష్ట్రంలో కరీంనగర్ చేప పిల్లల పెంపకంలో ప్రథమస్థానంలో ఉందని అన్నారు. స్థానికంగా నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేస్తున్నామని, భవిష్యత్‌లో మార్కెట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News July 8, 2025

కరీంనగర్: విధుల్లో నిర్లక్ష్యం చూపిన అధికారి తొలగింపు

image

కరీంనగర్ మండల విద్యాధికారి కే.భద్రయ్య తన విధుల పట్ల పలుమార్లు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూపడమే కాకుండా పైఅధికారుల ఆదేశాలను పాటించకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఆయనను విధుల నుంచి తొలగిస్తూ వీణవంక మండలంలోని ఎల్బక జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు ఎం.అంజా రెడ్డికి కరీంనగర్ మండల విద్యా అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.