News August 20, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,50,293 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.65,775, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.70,900, అన్నదానం రూ.13,618,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News February 6, 2025

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మహా మండపంలో వేదోచ్చరణతో స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించి, లడ్డు ప్రసాదం అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు

News February 6, 2025

వేములవాడ: రాజన్న సేవలో జబర్దస్త్ నటులు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుదీర్, ఆటో రామ్ ప్రసాద్‌లు దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.

News February 6, 2025

రాజన్న సిరిసిల్ల: మహిళ ఫొటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అరెస్ట్..

image

స్నానం చేస్తుండగా మహిళ ఫొటోలు, వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య ఓ మహిళ స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడని బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!