News September 8, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆదివారం ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.39,906 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.13,900, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,700, అన్నదానం రూ.3,306 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Similar News
News October 7, 2024
ధర్మపురి: దసరా ఆఫర్ లక్కీ డ్రా నిర్వాహకులపై కేసు
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా లక్కీ డ్రా నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దసరా ధమాకా లక్కీ డ్రా అనే క్యాప్షన్‌తో అమాయకపు ప్రజల వద్ద నుంచి పలువురు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫ్రిడ్జ్, మేక, కుక్కర్, కోళ్లు, మద్యం బాటిళ్లు అని బహుమతుల పేర్లతో స్కీం నిర్వహిస్తున్న 8 మంది నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ధర్మపురి ఎస్ఐ మహేశ్ తెలిపారు.
News October 7, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ మానకొండూరు మండలంలో విద్యుత్ షాక్ తో లైన్మెన్ మృతి.
@ ఇబ్రహీంపట్నం మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య.
@ గుండెపోటుతో హుజురాబాద్ ఆర్టీసీ డిపో డ్రైవర్ మృతి.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న దుర్గ నవరాత్రి ఉత్సవాలు.
@ కరీంనగర్ జిల్లా గ్రంధాలయ చైర్మన్‌గా మల్లేష్.
@ రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా సత్యనారాయణ గౌడ్.
@ మెట్ పల్లి ఆర్టీసీ బస్టాండ్ లో బతుకమ్మ సంబరాలు.
News October 6, 2024
నంది గరతుమంతుడి వాహనంపై ఊరేగిన రాజన్న
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ దేవీ నవరాత్రోత్సవాలలో భాగంగా ఆదివారంరాత్రి స్వామి నంది గరుత్మంతుడి వాహనంపై విహరించారు. నవరాత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.