News September 15, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,90,723 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,71,772, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.57,700, అన్నదానం రూ.61,251 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Similar News
News October 13, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి TOP న్యూస్
@ ఓదెల మండలంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి.
@ రామాజీపేటలో దాడికి పాల్పడిన ఎనిమిది మందిపై కేసు.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మెట్‌పల్లిలో ఘనంగా బతుకమ్మల నిమజ్జనం.
@ జగిత్యాలలోని టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీలో జెర్రీ.
@ మంథనిలో తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తికి గాయాలు.
@ కాటారం మండలం విలాసాగర్‌లో సీసీ కెమెరాల ప్రారంభం.
News October 13, 2024
వేములవాడలో రేపు మంత్రి కొండా సురేఖ పర్యటన ఇలా..
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రేపు (సోమవారం) రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకోనున్నారు. ఆలయంలో పూజల అనంతరం బద్ది పోచమ్మను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించనున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నారు.
News October 13, 2024
GREAT: జగిత్యాల: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అన్నాచెల్లెళ్లు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు లక్కం మునిరాజ్, లక్కం రిషిత ఇటీవలే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జగిత్యాల పట్టణంలో MLC జీవన్ రెడ్డి వారిని శాలువాలతో సన్మానించి, మెమెంటో అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరారు.