News September 28, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.84,148 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.30,366, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.32,670, అన్నదానం రూ.21,112 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Similar News
News November 25, 2025
HZB: పేదలకు మెరుగైన వైద్యం అందజేయాలి: బండి

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సందర్శించారు. సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News November 25, 2025
KNR: భవన నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సులు

భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పది రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ తెలిపారు. లేబర్ కమిషనర్ హైదరాబాద్ ఆదేశాల మేరకు డిసెంబర్ 3 వరకు ఈ సదస్సులు జరుగుతాయి. ప్రమాద బీమా, సహజ మరణం, పెళ్లి కానుక, ప్రసూతి లబ్ధి వంటి అంశాలపై నిర్వహించే ఈ సదస్సులను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 24, 2025
KNR: ‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.


