News November 5, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.2,49,322 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,39,134, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.76,550, అన్నదానం రూ.33,638,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

Similar News

News December 11, 2024

సిరిసిల్ల: ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు: ఎస్పీ

image

సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నెలల పాటు సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టెన్త్ సర్టిఫికెట్‌తో ఈనెల 12  నుంచి 15 వరకు వారి పరిధి పోలీస్ స్టేషన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

News December 11, 2024

ఎల్లారెడ్డిపేట: గుండెపోటుతో రైతు మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రైతు చిందు శంకర్ (50) వ్యవసాయ పొలం వద్ద పనులు చేసి ఇంటికి వచ్చి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి అంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. శంకర్‌‌కు భార్య పద్మ, కుమారులు శ్రీనివాస్ శ్రీకాంత్, కుమార్తె ఉన్నారు. 

News December 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ శంకరపట్నం మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీ. @ ఇబ్రహీంపట్నం మండలంలో హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు. @ కథలాపూర్ మండలంలో జెడ్పి ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి రాము. @ ఈ నెల 15లోగా సీఎంఆర్ అందించాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ చందుర్తి మండలంలో ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్. @ వేములవాడ రాజన్నా ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ. @ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పట్ల మెట్పల్లిలో నిరసన.