News November 5, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారికి రూ.2,27,188 ఆదాయం
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.2,27,188 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,57,776, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.45,690, అన్నదానం రూ.23,732,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
Similar News
News December 4, 2024
పెద్దపల్లిలో సీఎం షెడ్యూల్ ఇదే
* గ్రూప్4 ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేత
* సింగరేణిలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి నియామకపత్రాలు అందజేత
* 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామకపత్రాలు అందజేత
* స్కిల్ వర్శిటీలో భాగమయ్యే సంస్థలతో ఒప్పందాలపై సంతకాలు
* డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్, సీఎం కప్ ప్రారంభం
* బస్ డిపో, పెద్దపల్లి-సుల్తానాబాద్ బైపాస్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
* కొత్తగా మంజూరైన పోలీస్ స్టేషన్లు ప్రారంభం
News December 4, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,54,486 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.98,703 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.43,520, అన్నదానం రూ.12,263,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
News December 3, 2024
KNR: దివ్యాంగులు.. తమలోని దివ్యశక్తిని మేల్కొల్పాలి: కలెక్టర్
దివ్యాంగులు తమలోని దివ్యశక్తిని మేల్కొలిపి ఆత్మవిశ్వాసం, పట్టుదలతో రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని సంకల్పంతో కృషి చేస్తే వైకల్యం చిన్నబోయి ఫలితం దానంతట అదే వస్తుందన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని.. మంగళవారం కలెక్టరేట్‌లో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులశాఖ, DRDA ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.