News November 7, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారికి రూ.1,30,693 ఆదాయం
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,30,693 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.63,514 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.43,550, అన్నదానం రూ.23,629 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Similar News
News December 1, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్.@ ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి విక్రత అరెస్ట్. @ జగిత్యాల లో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ. @ పెద్దపల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. @ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ధర్మపురి నరసన్నా ఆలయాలను దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్.
News December 1, 2024
పెద్దపల్లి: పాఠశాల భోజనాలను తరచుగా తనిఖీ చేయాలి: మంత్రి పొన్నం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా జరుగుతుందని మంత్రి పొన్నం అన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వ పాలసీ అనుసరిస్తూ సహకారం అందిస్తున్నారన్నారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ ను కలెక్టర్, ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. మెస్ ఛార్జీల బిల్లులను గ్రీన్ చానల్స్ ద్వారా సరఫరా చేస్తామన్నారు.
News December 1, 2024
సీఎం పర్యటన నేపథ్యంలో పెద్దపల్లిలో పర్యటించిన మంత్రులు
డిసెంబర్ 4న సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పర్యటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పెద్దపల్లికి చేరుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలోని వెల్ఫేర్ వద్ద కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్పగుచ్ఛంతో వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో MLAలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విజయరమణారావు, మక్కాన్ సింగ్ ఉన్నారు.