News November 24, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.4,63,285 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.2,87,882 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,40,020, అన్నదానం రూ.35,383,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

Similar News

News December 2, 2024

రాజన్న ఆలయంలో మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు

image

వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం మార్గశిర మాసం మొదటి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. చాలా మంది భక్తులు కొత్తగా పెళ్లయిన భక్తులు కోడలెక్కులు చెల్లించుకుంటూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఆలయం ముంగట గజ స్థంభ వద్ద అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు.

News December 2, 2024

కోనరావుపేట: ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట

image

ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి, కోనరావుపేట మండలాలకు కేంద్రాలకు అంబులెన్స్ మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ మంజూరు చేయడం పట్ల వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.

News December 2, 2024

ములుగులో ఎన్‌కౌంటర్.. మృతుల్లో పెద్దపల్లి వాసి..!

image

ములుగు జిల్లాలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌కు చెందిన ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి(43)ఉన్నారు. కాగా, వారి మృతదేహాలు ములుగు జిల్లా ఏటూరునాగారం ఆసుపత్రిలో ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.