News November 29, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్ర వారం రూ.3,09,170 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,57,173, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,13,510, అన్నదానం రూ.38,487,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News December 6, 2024
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి: ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు
KNR జిల్లాలోని పలు పాఠశాలలు, హాస్టళ్లను విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలన్నారు. స్వచ్ఛమైన మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు.
News December 5, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్. @ మహాదేవపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ 36వ సారి అయ్యప్ప దీక్ష స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. @ కథలాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి. @ ఇల్లంతకుంట మండలంలో చిన్నారిపై పిచ్చికుక్కల దాడి. @ మెట్పల్లి పట్టణంలో అక్రమ ఇసుక రవాణా లారీ పట్టివేత.
News December 5, 2024
పెద్దపల్లి: 4 ఎకరాల 31 గుంటల్లో బస్సు డిపో
పెద్దపల్లి జిల్లా ప్రజల చిరకాల కోరిక బస్సు డిపో ఏర్పాటు తీరింది. పెద్దపల్లి పట్టణంలో 4 ఎకరాల 31 గుంటల్లో బస్సు డిపో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీ అభిమాన నాయకుడు విజ్జన్న నిరంతరం పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారని, ఆయన శాసనసభ్యుడిగా గెలవడం వల్లనే ఈరోజు పెద్దపల్లికి బస్సు డిపో, బైపాస్ రోడ్డు, నాలుగు పోలీస్ స్టేషన్స్ మంజూరు అయ్యాయని తెలిపారు.