News December 21, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,39,961 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.78,396 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.41,040, అన్నదానం రూ.20,525,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ వివరించారు.
Similar News
News January 14, 2025
KNR: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
సిరిసిల్ల: జగన్నాథం పార్థివదేహాన్ని సందర్శించిన కేటీఆర్
అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు మంద జగన్నాథం పార్థివదేహాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
News January 13, 2025
ఒకే వేదికపై కరీంనగర్ పార్లమెంటు సభ్యులు
నిన్న జరిగిన ఉనిక పుస్తక ఆవిష్కరణలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఒకే వేదికను పంచుకున్నారు. అయితే ఈ వేదికపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావును నేను ఓడిస్తే.. నన్ను వినోద్ కుమార్ ఓడించాడు. మా ఇద్దరినీ బండి సంజయ్ ఓడించాడని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఏది ఏమైనా కరీంనగర్ జిల్లాకు వన్నె తెచ్చిన మహనీయుడు విద్యాసాగర్ రావు అన్నారు.