News January 1, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,06,018 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.73,514, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.22,490, అన్నదానం రూ.10,014 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News January 7, 2025

KNR: పంచాయతీ పోరు.. దావతుల జోరు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మార్చి, ఏప్రిల్‌లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ఫిబ్రవరిలోపే ఎలక్షన్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకముందే ఆశావహులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ముందస్తు దావతులు ఇస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈసారి సర్పంచ్ బరిలో నిలిచేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.

News January 7, 2025

అత్యధికంగా కరీంనగర్, అత్యల్పంగా రామగుండం

image

ఉమ్మడి KNR జిల్లాలోని ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 29,98,815 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. అత్యధికంగా KNR నియోజకవర్గంలో 3,68,269 మంది ఉండగా.. 2,16,389 మంది ఓటర్లు అతి తక్కువగా రామగుండంలో ఉన్నారు. KNR(D) 10,83,365, జగిత్యాల(D) 7,20,825, PDPL(D) 7,18,042, SRCL(D) 4,76,604 ఉండగా.. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 2,51,150 మంది ఓటర్లు ఉన్నారు.

News January 7, 2025

జగిత్యాల: వెటర్నరీ సైన్స్ బెస్ట్ ప్రొఫెషన్: కలెక్టర్

image

వెటర్నరీ సైన్స్ బెస్ట్ ప్రొఫెషన్ అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల వెటర్నరీ కళాశాల వార్షికోత్సవ వేడుకలలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెటర్నరీ రంగం రైతుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుందని, పశుసంవర్ధక ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మెరుగవుతుందన్నారు. విద్యార్థులు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రశంసించారు.