News January 13, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.2,22,830 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,07,530, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.70,770, అన్నదానం రూ.44,530 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News February 10, 2025
జమ్మికుంట: వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ జిల్లా కార్యదర్శిగా రాజు

వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల రాజును నియమిస్తున్నట్లు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఛైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు రాజుకు నియామక పత్రాన్ని ఆదివారం అందజేశారు. అంబాల రాజు మాట్లాడుతూ.. వినియోగదారులకు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
News February 9, 2025
కరీంనగర్: వ్యక్తిని ఢీకొన్న బైక్.. స్పాట్‌లో మృతి

జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొలిపూరీ మైసయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడు బస్ స్టాండ్ నుంచి ఇంటికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన బైక్ అతడిని ఢీ కొట్టిందని, దీంతో అతడి తలకు తీవ్ర గాయమైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 9, 2025
కరీంనగర్: కడుపునొప్పి భరించలేక వృద్ధుడు ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి గ్రామానికి చెందిన అమరగొండ వీరయ్య (75) అనే వృద్ధుడు ఆదివారం తెల్లవారుజామున చేదబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ సీహెచ్. తిరుపతి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నారు.