News January 18, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,34,601 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.78,994 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.46,250, అన్నదానం రూ.9357 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News February 16, 2025
కరీంనగర్: గనుల శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసిన కలెక్టర్

కరీంనగర్‌లోని ఆర్ అండ్ బి వసతి గృహంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కతో స్వాగతం పలికారు. జిల్లాలో ఇసుక యార్డులు, ఇసుక లారీల బుకింగ్‌లు, నిల్వల వివరాలను జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ఆయనకు వివరించారు.
News February 15, 2025
శంకరపట్నం: ‘15 రోజుల్లోనే 39 మంది గాయపడ్డారు’

శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో కోతులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాటి ధాటిని తట్టుకోలేక పోతున్నారు. గడిచిన 15 రోజుల్లోనే వాటి దాడిలో 39 మంది గాయపడ్డారని వైద్యాధికారి డా.శ్రావణ్ తెలిపారు. జనవరి మాసంలో 42 మంది కుక్క కాటుకు, 46 మంది కోతుల దాడికి గురైనట్లు వెల్లడించారు.
News February 15, 2025
శంకరపట్నం: తాటిచెట్టు పైనుంచి పడిన గీత కార్మికుడు

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కరీంపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం వీరాస్వామి శనివారం సాయంత్రం గ్రామ శివారులోని ఓ తాటి చెట్టుపై కల్లు గీసి దిగుతుండగా కిందపడినట్లు స్థానికులు తెలిపారు. అతడు తీవ్రంగా గాయపడటంతో వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.