News January 19, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,49,539 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,31,444 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.95,765, అన్నదానం రూ.22,330,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News December 2, 2025
హైదరాబాద్లో జిల్లా జర్నలిస్టుల ధర్నా

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తలపెట్టిన చలో సమాచార భవన్ కార్యక్రమం విజయవంతమైనట్లు టీడబ్ల్యూజే ఎఫ్ జిల్లా కార్యదర్శి కుడి తాడి బాపురావు తెలిపారు. ఈ ధర్నాలో జర్నలిస్టులకు కొత్త అక్రిడియేషన్ కార్డులు, భీమా, ఆరోగ్య ప్రయోజనాలు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తదితర సమస్యలను డిమాండ్ చేసినట్లు కరీంనగర్ జిల్లా జర్నలిస్టులు పేర్కొన్నారు.
News December 1, 2025
KNR: లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తప్పవు: DMHO

లింగ నిర్ధారణ నిషేధ చట్టం (PCPNDT) అమలుపై DMHO డా.వెంకటరమణ అధ్యక్షతన అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశం కరీంనగర్ DMHO కార్యాలయంలో నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 07 స్కానింగ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నేరమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చేస్తే 9849902501 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News December 1, 2025
KNR: ‘హెచ్ఐవీ తగ్గుముఖం.. ‘జీరో’ లక్ష్యంగా కృషి’

దేశంలో ఎయిడ్స్ తగ్గుముఖం పడుతుందని ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కరీంనగర్ ఫిలిం భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను ‘జీరో’కు తీసుకురావడమే ధ్యేయమన్నారు. వ్యాధిగ్రస్తులు ధైర్యంగా మందులు వాడాలని సూచించారు. అనంతరం ఐసీటీసీ కౌన్సిలర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.


