News January 24, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆదాయం ఎంతంటే..!

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.73,710 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.38,582, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,905, అన్నదానం రూ.13,223 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
Similar News
News October 24, 2025
దేవరకద్రలో వ్యక్తి దారుణ హత్య

దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన దానం మైబు(40) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శక్రవారం వెలుగు చూసింది. మైబు హమాలి పని ముగించుకొని గురువారం రాత్రి 9:30 గంటలకు బైక్ పై ఇంటికి వెళ్తుండగా అడవి అజిలాపూర్ గేటు సమీపంలో గుర్తుతెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
News October 24, 2025
పాలమూరు: టపాసులు పేలి విద్యార్థులకు గాయాలు

టపాసులు పేలి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. పాలమూరు రూరల్ రేగడిగడ్డ తాండ పంచాయతీ పరిధిలోని ప్రైమరి పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఉదయం క్లాస్ బయట టపాసులు పేల్చారు. అవి పేలడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సమయంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.
News October 24, 2025
బస్సు ప్రమాదంలో 13మంది తెలంగాణవాసులు!

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన చోటుకు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్, SP చేరుకున్నారు. ‘బస్సులో 13 మంది తెలంగాణవాసులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఏడుగురికి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురు HYD, ఖమ్మం, RR, సంగారెడ్డికి చెందినవారిగా గుర్తించాం. మిగిలిన ఆరుగురు చనిపోయారా, బతికున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది’ అని అన్నారు. హెల్ప్ లైన్ నంబర్స్: 9912919545, 9440854433.


