News January 26, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,96,549 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.75,680, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.75,680, అన్నదానం రూ.20,591,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News November 7, 2025

GOOD NEWS: బీటెక్‌ చేస్తే GHMCలో ఉద్యోగాలు

image

GHMC, అర్బన్ లోకల్ బాడీస్‌లో ఔట్‌ సోర్సింగ్ ప్రాతిపదికన సైట్ ఇంజినీరు, జూనియర్ ప్లానింగ్ పర్సనల్ పోస్టులకు దరఖాస్తులను NAC ఆహ్వానిస్తోంది. సైట్ ఇంజినీర్ 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. B.E/B.Tech/AMIE(సివిల్ ఇంజినీరింగ్) చేసిన వారు అర్హులు. 15 జూ.ప్లానింగ్ పోస్టులకు B.Arch/ B. Plan/ MURP/M (ప్లానింగ్) చేసి ఉండాలి. దరఖాస్తులకు NOV 8 చివరి తేదీ. వివరాలకు www.nac.edu.inను సంప్రదించండి. SHARE IT

News November 7, 2025

సంగారెడ్డి: ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగేలా చూడాలి: మంత్రి

image

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వైద్య శాఖకు వచ్చిన గ్రూప్-1 అధికారులతో హైదరాబాద్‌లోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేదలు వస్తారని.. వారిపై ప్రేమ చూపించాలని పేర్కొన్నారు.

News November 7, 2025

రెండు శనివారాల్లో పనిపై పునరాలోచించండి: APTF

image

AP: తుఫాను కారణంగా స్కూళ్లకు ఇచ్చిన సెలవులకు పరిహారంగా రెండు శనివారాలు పనిచేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని ఏపీటీఎఫ్ కోరింది. 220 పనిదినాలు సర్దుబాటయ్యే స్కూళ్లను ఈ ఉత్తర్వుల నుంచి మినహాయించాలంది. అలాగే నవంబర్ 10న మూడో కార్తీక సోమవారం, 14న బాలల దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.