News January 26, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,96,549 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.75,680, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.75,680, అన్నదానం రూ.20,591,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News February 14, 2025

స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తెచ్చేందుకు కృషి: శ్రీనివాస వర్మ

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పునరుద్ఘాటించారు. కొన్ని కారణాల వల్ల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.11,400కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని గుర్తుచేశారు. CM CBN, మంత్రి లోకేశ్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

News February 14, 2025

మర్రిగూడ: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

image

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సరంపేట గ్రామానికి చెందిన ఓ రైతు ఎనిమిది గుంటల భూమి సర్వే విషయంపై సర్వేయర్ రవి నాయక్‌ను సంప్రదించగా.. అతడు రూ.15వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయంలో రవి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

News February 14, 2025

భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్

image

భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(ఎన్.యూ.జే.ఐ) నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొమ్మటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడిగా బండారి రాజు, గట్టు రవీందర్, అరిగేలా జనార్దన్, పూర్తి కమిటీని ఎన్నుకున్నారు.

error: Content is protected !!