News July 19, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.56,449 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.29,282, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.17,100, అన్నదానం రూ.10,067 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Similar News
News December 10, 2024
ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ: KNR ఆర్టీసీ RM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఈ రాయితీ ఈనెల 1 నుంచి 31 వరకు ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్, రాజధాని బస్సు సర్వీసుల్లో వర్తిస్తుందన్నారు. కావున, ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News December 9, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ గంభీరావుపేట మండలంలో ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.
@ రాయికల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జగిత్యాల డిఎస్పీ.
@ కరీంనగర్ ప్రజావాణిలో 208 ఫిర్యాదులు.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మెట్పల్లి మండలం ఆరపేటలో వైభవంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు తాజా మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్.
News December 9, 2024
KNR: ప్రజావాణికి 208 దరఖాస్తులు
కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. 208 మంది అర్జీదారులు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి అర్జీదారుల నుంచి దరఖాస్తుల స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.