News January 27, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.2,06,182 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,11,055ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.61,090, అన్నదానం రూ.34,037,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News December 7, 2025
బాపట్ల: నేడు ఎన్ఎంఎంఎన్ ఎగ్జామ్..పరీక్షా కేంద్రాలివే

బాపట్ల జిల్లాలో చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో నేడు జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలకు 2,412 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్వహణకు ఫ్లయింగ్ స్క్వాడ్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, కస్టోడియళ్లను నియమించాలన్నారు. ఉదయం 10- మ.1 గంట వరకు ఈ ఎగ్జామ్ జరుగుతుందన్నారు.
News December 7, 2025
ICCC డెమో నిర్వహించిన టీటీడీ

తిరుమల వైకుంఠ 1 క్యూ కాంప్లెక్స్ లో దాత సహకారంతో ఏర్పాటు చేసిన integrated command and control center (ICCC) డెమో పరిశీలన శనివారం జరిగింది. అలిపిరి నుంచి తిరుమల వచ్చే భక్తుల సమయపాలనపై పరిశీలన చేశారు. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ అంచనా కోసం పరిశీలన చేశారు. ఇటీవల రెండు రోజుల పాటు దీనిపై విజిలెన్స్ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు సమాచారం.
News December 7, 2025
చలికాలం.. వీళ్లు జాగ్రత్త!

చలికాలంలో గుండెజబ్బుల ముప్పు ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు తీవ్రత సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నవంబర్-ఫిబ్రవరి మధ్య హార్ట్ ఎటాక్ ఘటనలు 15-20% అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. గుండె జబ్బులు, BP, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


