News February 9, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.3,62,107 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.2,18,521, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,15,550, అన్నదానం రూ.28,036 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News November 24, 2025
బేబీ కార్న్‌ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్‌గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.
News November 24, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☞ బంగారం 24 క్యారెట్ 1 గ్రాము రూ.12,440
☞ బంగారం 22 క్యారెట్ 1 గ్రాము రూ.11,445
☞ వెండి 10 గ్రాములు రూ.1,577.
News November 24, 2025
VKB: జిల్లా రాజకీయాల్లో యువ గర్జన.. పాత లీడర్లకు సవాల్!

వికారాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికల హీట్ మొదలైంది. ఈసారి పంచాయతీల్లో యువత పెద్ద ఎత్తున రంగంలోకి రావడంతో రాజకీయ వాతావరణం మారిపోయింది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలు చేస్తూ, గ్రామ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పాత నేతలకు యువత నేరుగా సవాల్ విసురుతోంది. ఈ ఎన్నికల్లో “యువ శక్తి vs పాత నేతలు” పోటీ హాట్‌గా మారనుంది. యువ శక్తే ఈసారి గేమ్‌చేంజర్ అవుతుందా? అనే ఆసక్తి నెలకొంది.


