News February 20, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,19,908 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.56,714, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.51,035, అన్నదానం రూ.12,159 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News November 24, 2025
ధర్మేంద్ర చివరి సినిమా ఇదే

బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరేతో సినీ ప్రవేశం చేశారు. 1960-80 మధ్య స్టార్డమ్ సంపాదించారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర.. షోలే, పూల్ ఔర్ పత్తర్, చుప్కే చుప్కే వంటి బ్లాక్బస్టర్ చిత్రాల్లో నటించారు. చివరిగా 2024లో తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియాలో సినిమాలో కనిపించారు. ధర్మేంద్ర చివరి మూవీ ఇక్కీస్ విడుదల కావాల్సి ఉంది.
News November 24, 2025
చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

టమాటా ధరల పెరుగుదలతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ధరలు ఇలా ఉన్నాయి. నాణ్యత కలిగిన టమాటా ధరలు మొదటి రకం 10 కిలోలు ములకలచెరువు- రూ.510, పుంగనూరు-రూ.100, పలమనేరు- రూ.480, వీకోట-రూ.500 వరకు ధర పలుకుతోంది. వర్షాల కారణంగా పంట తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
News November 24, 2025
పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్బస్టర్!

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.


