News February 20, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,19,908 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.56,714, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.51,035, అన్నదానం రూ.12,159 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News March 17, 2025
గుంటూరు: 10మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

గుంటూరు మండల విద్యాశాఖ అధికారి ఎస్.ఎం.ఎం ఖుద్దూస్ 10 మంది ఉపాధ్యాయులకు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. పదోతరగతి ఇన్విజిలేషన్ డ్యూటీ రిపోర్ట్‌లో నిర్లక్ష్యం చేయడంతో ఆ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఆదేశానుసారం నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తాఖీదు అందిన వెంటనే సంబంధిత ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలని ఖుద్దూస్ సూచించారు.
News March 17, 2025
మీ పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తింటున్నారా?

చాక్లెట్ల నుంచి పిల్లలను వేరు చేయలేం. వాటిని సాధించేదాక వాళ్లు చేసే అల్లరి అంతాఇంతా కాదు. అలా అని ఒకటితో సరిపెట్టరు. ఇలా ఎక్కువగా చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోవడంతో పాటు వాటికి రంధ్రాలు ఏర్పడే ఆస్కారం ఉంది. అలాగని వాటిని తినకుండా ఉంచలేం. కాబట్టి రాత్రి పడుకునే ముందు వారితో బ్రష్ చేయిస్తే పళ్ల మధ్య అతుక్కుపోయిన చాక్లెట్ బయటికి వస్తుంది. దీంతో 10 గంటల వరకూ పళ్లకు రక్షణ కలుగుతుంది.
News March 17, 2025
SRPT: మొట్టమొదటి MBBS డాక్టర్ రామకృష్ణారెడ్డి మృతి

కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ బీ.రామకృష్ణారెడ్డి ఆదివారం కోదాడలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో మృతిచెందారు. కాగా, కోడాడకు మొట్టమొదటి MBBS డాక్టర్ ఈయనే. రామకృష్ణారెడ్డికి కోదాడ పరిసర ప్రాంతాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే ఆయన అమెరికాలో ఎండీ కోర్స్ పూర్తి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.