News March 14, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.5,11,031 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,85,465, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.2,80,500, అన్నదానానికి రూ.45,066 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News November 23, 2025
ఇది ప్రభుత్వ బాధ్యారాహిత్యమే: జడ్పీ ఛైర్మన్

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ బాధ్యారాహిత్యానికి నిదర్శనమని జడ్పీ ఛైర్మన్, YCP జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ఆదివారం విమర్శించారు. కేంద్రాలు ఆలస్యంగా తెరవడం వల్ల ఇప్పటికే రైతులు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయారన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన తమ హయంలో జరిగిందని, 23 శాతం నిర్మాణ పనులు కూడా YCP ప్రభుత్వంలోనే పూర్తయ్యాయన్నారు.
News November 23, 2025
భీమవరం: 29న మెగా జాబ్ మేళా

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News November 23, 2025
ఆన్‌లైన్‌లో అర్జీలు సమర్పించండి: అనకాపల్లి కలెక్టర్

అనకాపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు అర్జీలకు మీ కోసం వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేయవచ్చని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి అర్జీలు స్వీకరించినట్లు వెల్లడించారు. అర్జీల సమాచారం కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చన్నారు.


