News March 14, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.5,11,031 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,85,465, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.2,80,500, అన్నదానానికి రూ.45,066 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News March 16, 2026
కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదు: JC

కర్నూలు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 11వేల సిలిండర్లు నిల్వలో ఉండగా, అదనంగా 7వేల సిలిండర్లు చేరుకున్నాయన్నారు. ప్రతిరోజు సగటున 10వేల సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ జరుగుతోందన్నారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఏజెన్సీలు ఇబ్బందులు కలిగిస్తే 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News March 16, 2026
పెండింగ్ కేసులపై దృష్టి సారించండి: భద్రాద్రి ఎస్పీ

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో SHOలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. న్యాయాధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం పాటిస్తూ, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పాత కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
News March 16, 2026
VZM: కలెక్టరేట్‌లో ప్రజల నుండి 233 వినతుల స్వీకరణ

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మొత్తం 233 వినతులు అందగా అందులో 130 రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయి. వినతులను సకాలంలో పరిష్కరించాలని, ఆలస్యం సహించబోమని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.


