News March 24, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అదివారం రూ.2,97,110 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,74,546 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,04,900, అన్నదానానికి రూ.17,664 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News November 19, 2025
ASF: 18 ఏళ్లు నిండిన మహిళకు చీరలు

రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ పథకం కింద ఏకరూప చీరలు పంపిణీ చేయాలని సీఏం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ఆయన ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఏఎస్ఎఫ్ కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో చర్చించి పంపిణీ ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు.
News November 19, 2025
రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
News November 19, 2025
హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన

మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ చనిపోయాక ఆస్తుల విషయంలో పుట్టింటి, అత్తింటి వారికి వివాదాలు వస్తున్నాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తులు భర్త ఫ్యామిలీకి చెందుతాయి.


