News March 29, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,63,699 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,08,012, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,880, అన్నదానానికి రూ.10,807 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News July 8, 2025
మహబూబాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్

కాచిగూడ నుంచి మహబూబాబాద్, డోర్నకల్ మీదుగా తిరుపతి వెళ్లడానికి స్పెషల్ ట్రైన్ నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే ఎస్టీఎం రాజనర్సు తెలిపారు. కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ స్పెషల్ ట్రైన్ జులై 10, 17, 24, 31 తేదీల్లో నడుపుతున్నామని ప్రయాణికులు గమనించాలని సూచించారు.
News July 8, 2025
బాధితులకు సత్వర న్యాయం జరగాలి: SP అశోక్ కుమార్

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా SP అశోక్ కుమార్ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం జరగాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువవ్వాలన్నారు.
News July 8, 2025
చర్చకు రాకుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పు: KTR

TG: సీఎం రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, తాము సరిపోతామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ‘రేవంత్.. నిజాయితీ, నిబద్ధత ఉంటే చర్చకు రా. లేకపోతే తప్పుడు కూతలు కూసినందుకు, మహా నాయకుడిపై అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి KCRకు క్షమాపణలు చెప్పు. చర్చ కోసం రేవంత్ ఎక్కడికి రమ్మన్నా వస్తా. చర్చకు సత్తా లేకపోతే సవాళ్లు చేయొద్దు. సీఎంకు వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.