News February 12, 2025
ధర్మవరంలో ఈ నెల 16న సీనియర్ హాకీ ఎంపిక పోటీలు

ధర్మవరంలోని హైస్కూల్ గ్రౌండ్‌లో ఈ నెల 16న సీనియర్ పురుషుల హాకీ ఎంపిక పోటీలు జరుగుతాయని అసోసియేషన్ సెక్రటరీ సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు మార్చి నెలలో గుంటూరులో జరిగే 15వ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే సీనియర్ క్రీడాకారులు 01-01-1991 తర్వాత జన్మించి ఉండాలన్నారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని కోరారు.
Similar News
News March 20, 2025
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి..

కర్లపాలెం మండలం యాజలికి చెందిన ప్రవీణ్ కుమార్(15) ఈతకు వెళ్లి బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. యాజలిలోని పంట పొలాల్లో 20 అడుగుల లోతు ఉన్న ఓ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలిపారు. మరో ఘటనలో పిట్టలవానిపాలెం మండలం గోకరాజునల్లి బోయినవారిపాలెంలో విద్యుత్ షాక్ తగిలి కలుసు బేబీ(6) అనే బాలిక మృతి చెందింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
News March 20, 2025
KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 38.9°C నమోదు కాగా, జమ్మికుంట 38.7, చిగురుమామిడి 38.2, శంకరపట్నం 38.0, కరీంనగర్ రూరల్ 37.9, గన్నేరువరం 37.7, మానకొండూర్ 37.6, తిమ్మాపూర్ 37.3, వీణవంక 37.2, రామడుగు 37.0, కరీంనగర్ 36.7, కొత్తపల్లి 36.0, హుజూరాబాద్ 35.5, ఇల్లందకుంట 35.4, చొప్పదండి 35.0, సైదాపూర్ 34.6°C గా నమోదైంది.
News March 20, 2025
అమలాపురం కుర్రాడికి గేట్‌లో 10వ ర్యాంక్

అమలాపురం మండలం బండారులంకక చెందిన చేనేత కార్మికుని కుమారుడు పిచ్చుక కుమార్ వాసు గేట్ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియాలో పదవ ర్యాంకు సాధించాడు. బండారులంక గ్రామానికి పేరు తీసుకొచ్చిన విద్యార్థి తల్లిదండ్రులు మల్లేశ్వరరావు, రేణుక వాణి దంపతులను పలువురు సత్కరించారు.