News February 23, 2025
ధర్మవరంలో కిలో చికెన్ రూ.140

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ధర్మవరంలో ఇవాళ కిలో చికెన్ రూ.140-160 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-800లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
Similar News
News February 23, 2026
ASF: పోలీస్ ప్రజావాణిలో 8 దరఖాస్తులు

ఆసిఫాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ASF జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 8 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని, వాటిపై తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.
News February 23, 2026
అంతర పంటలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.
News February 23, 2026
జగిత్యాల: బాధితులకు సత్వర న్యాయం చేయాలి: ఎస్పీ

గ్రీవెన్స్ డే సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.


