News June 5, 2024
ధర్మవరంలో నోటాకు 1787 ఓట్లు

ధర్మవరం నియోజక వర్గంలో నోటాకు 1787 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ రోజు 2,20,455 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డికి 102810 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్‌కు 106544 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్వర్థ నారాయణకు 3758 ఓట్లు వచ్చాయి. మిగిలిన 13 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు.
Similar News
News July 11, 2025
కరవు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొందాం: కేంద్ర మంత్రి

రాయలసీమ జిల్లాల్లో కరవు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొందామని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో దక్షిణ ఏపీలోని కరవు పీడిత జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News July 10, 2025
‘విద్యార్థులారా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’

అనంతపురం JNTUలో స్వీడన్ బ్యాచ్ కోర్స్‌ను ప్రారంభించినట్లు వీసీ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ సుజాత తెలిపారు. 4 ఏళ్ల బీటెక్ CSE/ECE కోర్సులో మొదట మూడేళ్లు JNTUలో, 4వ ఏడాది స్వీడన్‌లో చదవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు JNTUలోని డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News July 8, 2025
మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలి: కలెక్టర్

పాఠశాలలో ఈనెల 10న జరగనున్న మెగా పేరంట్, టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులను అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మీటింగ్‌లో తల్లితండ్రులను భాగస్వాములను చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధి గురించి వివరించాలన్నారు.