News June 30, 2024
ధర్మవరంలో ముగిసిన హాకీ పోటీలు.. విజేత తిరుపతి జిల్లా జట్టు

ధర్మవరం పట్టణం ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో 14వ హాకీ ఏపీ స్టేట్ ఇంటర్ జిల్లా సీనియర్ మెన్ హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలు 27 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. ఫైనల్ పోటీల్లో తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లా జట్లు తలపడగా.. 4-1 గోల్డ్ తేడాతో తిరుపతి జట్టు విన్నర్‌గా, శ్రీ సత్యసాయి జిల్లా జట్టు రన్నర్‌గా నిలిచింది. విశాఖపట్నం జిల్లా, ఎన్టీఆర్ జిల్లాపై విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది.
Similar News
News February 26, 2026
ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ: కలెక్టర్

మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఫిబ్రవరి 28న ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేస్తారన్నారు. ఫిబ్రవరి నెలకు జిల్లాలో 2,77,073 మంది లబ్ధిదారులకు రూ.123.99 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. మొదటి రోజు పొందని వారు మార్చి 2న పింఛన్ పొందవచ్చన్నారు.
News February 26, 2026
అనంత: ఇంటర్ సెకండియర్ పరీక్షలు.. 368 మంది గైర్హాజరు

అనంతపురం జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సజావుగా జరిగినట్లు ఆర్ఐవో వెంకటరమణ నాయక తెలిపారు. గురువారం ఉదయం జరిగిన ఇంటర్ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 20,855 గాను 20,517 మంది హాజరవ్వగా.. 338 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,931కి గాను 1,901 మంది హాజరై 30 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.