News April 4, 2024
ధర్మవరంలో వరుసగా మూడుసార్లు గెలిచిన నాయకుడు

ధర్మవరం నియోజకవర్గంలో జి.నాగిరెడ్డి ప్రత్యేకస్థానంగా చెప్పవచ్చు. 1983 నుంచి 1989 వరకు వరుసగా మూడుసార్లు ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 ఎన్నికల్లో నియోజకవర్గ చరిత్రలోనే 40421అత్యధిక ఓట్ల మెజార్టీ, 1983లో 30605 రెండవ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది. ఈ ఎన్నికలలో ధర్మవరంలో ఈ రికార్డును బద్దలు కొడతారా కామెంట్ చేయండి.
Similar News
News November 16, 2025
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డాక్టర్ కార్తీక్ రెడ్డి

బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న కార్తీక్ రెడ్డి (39) పంపనూరు పుణ్యక్షేత్రంలో దైవ దర్శనానికి వచ్చి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పంపనూరు క్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవ దర్శనానికి వచ్చి సమీపంలోని కాలువలో స్నానానికి దిగగా నీటి ప్రవాహం ఎక్కువై కొట్టుకుపోయినట్లు వివరించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 16, 2025
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 16, 2025
భర్త హత్యాయత్నం ఘటనలో భార్య మృతి

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో అనుమానంతో ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకుంది. రత్నమ్మను కుటుంబసభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.


