News September 12, 2024

ధర్మవరంలో విషాదం.. కుమారుడి మృతి జీర్ణించుకోలేక తండ్రి సూసైడ్

image

ధర్మవరంలోని ప్రియాంక నగర్‌కు చెందిన వ్యాపారి రజనీ బాబు(50) బుధవారం ఇంట్లో ఉరివేసుకొని మృతిచెందాడు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రజనీ బాబు భార్య రామాంజనమ్మ ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఆమె విధులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రజనీబాబు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. రజనీబాబు కుమారుడు నిశాంత్ ఏడాది కిందట మృతిచెందాడు. కొడుకు మృతి జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

Similar News

News November 27, 2025

అనంత: పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు

image

అనంతపురంలో 2 ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉన్న 10 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించినట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. సెయింట్ మేరీ బాలికల ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ తెలుగు, LPT (తెలుగు, హిందీ), పీఈటీ పోస్టులు ఉన్నాయన్నారు. RCM ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్లో 5 SGT పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తు గడువును డిసెంబర్ 10 వరకు పొడిగించామన్నారు.

News November 26, 2025

అనంతపురం: ఆనంద్‌ది పరువు హత్య..?

image

ప్రేమ పేరుతో రప్పించి యనకళ్లు గ్రామానికి చెందిన వాల్మీకి బోయ ఆనంద్‌ను బ్రహ్మాసముద్రం మండలంలో హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బుధవారం ఏపీ వాల్మీకి బోయ సంఘం నాయకులు అక్కులప్ప, మాధవయ్య తదితరులు ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐ హరినాథ్‌కు వినతి పత్రం అందించారు.

News November 26, 2025

జిల్లాకు రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్

image

వినుకొండలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ గేమ్స్‌లో బాలికల అండర్-17 అథ్లెట్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్‌ షిప్‌ను పొందారు. ఇందులో పాల్గొన్న వర్షిత, ఇంద్ర లేఖ, మౌనిక తదితర 14 మంది బాలికలను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అభినందించారు. కార్యక్రమంలో గేమ్స్ అబ్జర్వర్ ప్రసాద్ రెడ్డి, ప్రవీణ, అనంతపురం జిల్లా మేనేజర్ పీడీ చల్లా ఓబులేసు, కోచ్ నారాయణ, చలపతిలు పాల్గొన్నారు.