News September 12, 2024

ధర్మవరంలో విషాదం.. కుమారుడి మృతి జీర్ణించుకోలేక తండ్రి సూసైడ్

image

ధర్మవరంలోని ప్రియాంక నగర్‌కు చెందిన వ్యాపారి రజనీ బాబు(50) బుధవారం ఇంట్లో ఉరివేసుకొని మృతిచెందాడు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రజనీ బాబు భార్య రామాంజనమ్మ ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఆమె విధులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రజనీబాబు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. రజనీబాబు కుమారుడు నిశాంత్ ఏడాది కిందట మృతిచెందాడు. కొడుకు మృతి జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

Similar News

News October 7, 2024

పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధానం అమలుపై ఎస్పీ పి.జగదీష్, జేసీ శివ్ నారాయణ్ శర్మతో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 15వ తేదీ తర్వాత జిల్లాలో ఉన్న 5 ఇసుక రీచ్‌లు మ్యానువల్ ఆపరేషన్‌లో ఉంటాయన్నారు.

News October 6, 2024

కదిరిలో ఘోరం.. పసి బిడ్డను వదిలి వెళ్లిన కసాయి తల్లి

image

స్థానిక RTC బస్‌స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ అక్కడే ఉన్న మరో మహిళకు తన 5 నెలల చిన్న పాపను తాను బాత్ రూమ్‌కు వెళ్లి వస్తానని ఇచ్చి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మహిళను గురించి వాకబు చేశారు. ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి పాపను ఈ రోజు ICDS వారికి అప్పగించారు. ఆచూకీ తెలిస్తే సీఐ, కదిరి టౌన్, సెల్ 94407 96851 సమాచారం ఇవ్వాలని కోరారు.

News October 6, 2024

శింగనమల: పిడుగుపాటుకు యువకుడి మృతి

image

అనంతపురం జిల్లాలో పిడుగుపాటుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శింగనమల మండలం పెద్దకుంటలో కురిసిన వర్షానికి పిడుగు పడి శింగనమల గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఋషింగప్ప(27) శంకర్ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.