News June 4, 2024
ధర్మవరంలో సత్యకుమార్ యాదవ్ ముందంజ

ధర్మవరం నియోజకవర్గ 19వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి వై.సత్యకుమార్ యాదవ్ ముందంజలోకి వచ్చారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 3300 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒకానొక దశలో 11 వేల ఓట్ల లీడ్‌లోకి కేతిరెడ్డి వెళ్లగా.. బత్తలపల్లె, ధర్మవరం రూరల్ ప్రజలు బీజేపీవైపు మొగ్గుచూపారు.
Similar News
News December 6, 2025
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పేరం స్వర్ణలత

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 మందిని ప్రకటించగా.. అందులో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన పేరం స్వర్ణవ్రతం ఉన్నారు. స్వర్ణలత ఇప్పటికే వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
News December 6, 2025
జగన్ క్షమాపణ చెప్పాలి: నాగరాజు

బలహీన వర్గాలకు చెందిన ఐపీఎస్ అధికారి గోపినాథ్ జెట్టిని, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి కిష్ణయ్యను అగౌరవపరుస్తూ మాట్లాడిన వైఎస్ జగన్‌మెహన్ రెడ్డి వారిరువురికీ వెంటనే క్షమాపణ చెప్పాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. మీలా తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని వారు ఐపీఎస్, ఐఏఎస్ పోస్టులు సంపాదించలేదన్నారు.
News December 6, 2025
బాలిక విన్నపంపై స్పందించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో నాల్గో తరగతి బాలిక ఐశ్వర్య తమ ఇంటి పట్టా సమస్యను ఎమ్మెల్యే సురేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లింది. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, టీడీపీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. ఐశ్వర్య కుటుంబానికి తక్షణమే ఇంటి పట్టా మంజూరు చేశారు. విద్యార్థి కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.


