News June 4, 2024
ధర్మవరంలో ‘సత్య’మే జయం
ధర్మవరం ఎమ్యెల్యేగా సత్యకుమార్ యాదవ్ విజయం సాధించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డిపై సత్యకుమార్ 5000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలినుంచి కేతిరెడ్డి మెజారిటీ సాధించగా.. చివర్లో బీజేపీ పుంజుకుంది. కేతిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత, కూటమినేతల సపోర్ట్, జాతీయనేత కావడం సత్యకు కలిసివచ్చింది. బీసీ ఓటర్లు సహా అన్ని సామాజికవర్గాల ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సత్య సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
Similar News
News November 7, 2024
సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు: ఎస్పీ
సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసినా, అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం ఎస్పీ ప్రకటన విడుదల చేస్తూ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా, వ్యక్తిగత పేరున ఫొటోలు మార్ఫింగ్ చేసినా, మానాభిమానులు దెబ్బతినే విధంగా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News November 7, 2024
సాగునీటికి ప్రతిపాదనలే కాదు.. నిధులు కావాలి: సీపీఎం
అనంతపురం జిల్లాలోని సాగునీటి వనరుల అభివృద్ధి కోసం అధికారులు ప్రతిపాదనలకే పరిమితం కాకుండా నిధులు రాబట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పేర్కొన్నారు. పీఏబీఆర్ రిజర్వాయర్‌ను 11.10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించి 3 దశాబ్దాలైనా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందని, ప్రతిపాదనలే కాక నిధుల మంజూరుకు ప్రయత్నించాలన్నారు.
News November 7, 2024
విషాదం.. తండ్రీకూతురి మృతి
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న రమేశ్, ఆయన కూతురు భవిత నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతపురానికి తరలించి చికిత్స అందిస్తుండగా తండ్రీకూతురు మృతి చెందారు. 10వ తరగతి చదువుతున్న భవిత స్టేట్ లెవెల్ హోకీ పోటీలకు హాజరై తిరిగి వస్తుండగా గుట్టూరు వద్ద వారు ప్రమాదానికి గురయ్యారు. తండ్రీకూతురి మృతి ఆ కుటుంబంలో విషాదం నింపింది.