News July 15, 2024
ధర్మవరం ఆర్టీసీ బస్సు దగ్ధం.. జిల్లావాసులకు గాయాలు

తెలంగాణ రాష్ట్రం మహాబూబ్ నగర్(D) బురెడ్డిపల్లి దగ్గర హైదరాబాద్ నుంచి ధర్మవరం వస్తున్న ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొంది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తి దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మెుత్తం 15మంది గాయపడ్డగా వారిలో అనంతపురం జిల్లాకు చెందిన సంజీవ, సునీల్, గాయత్రిలు ఉన్నారు. వారు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Similar News
News December 7, 2025
దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి: కలెక్టర్

దేశ రక్షణలో సైనికులు, మాజీ సైనికుల త్యాగాల వెలకట్టలేని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో సాయుధ దళాల పతాక నిధికి తన వంతు విరాళాన్ని హుండీలో వేశారు. అనంతరం సాయుధ దళాల పథక దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మాజీ సైనికులకు, అమరులైన సైనిక కుటుంబాలకు భూ పంపిణీ కోసం చర్యలు చేపట్టామన్నారు.
News December 7, 2025
యాడికి: నిద్ర మాత్రలు మింగి యువకుడి సూసైడ్

యాడికి మండలం నగురూరుకు చెందిన శరత్ కుమార్(23) నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకున్నాడు. గత నెలలో శరత్ కుమార్ బళ్లారిలో వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యాడు. శుక్రవారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతపురం తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
News December 7, 2025
ఫ్లోర్ బాల్ అనంతపురం జిల్లా జట్టు ఇదే..!

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు సిద్ధమైంది. ఇవాళ నరసరావుపేటలో జరగనున్న 19వ సీనియర్ ఫ్లోర్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో అనంతపురం జిల్లా జట్టు పాల్గొంటుందని జిల్లా సెక్రటరీ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.


