News September 24, 2024

ధర్మవరం ఘటనపై కేసు నమోదు

image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సోమవారం జరిగిన ఘటనపై కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో పాటు జడ్పీ వైస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డ్రైవర్ రామాంజనేయులు, అంజి, రఫీ, విజయ్, రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి చిగిచెర్ల తమపై దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ కార్యకర్త ప్రతాప్ రెడ్డి ధర్మవరం వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 13, 2024

మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ జేఎన్టీయూకు మార్పు

image

అనంతపురం జిల్లా మద్యం షాపులకు ఎంపిక ప్రక్రియ కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్ నుంచి జేఎన్టీయూకు మార్చామని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం 7 గంటలకు లాటరీ ద్వారా మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నమని తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు.

News October 12, 2024

భారీ వర్షాల నేపథ్యంలో రేపు కలెక్టరేట్‌లో సమీక్ష

image

ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు స్పందన గ్రీవెన్స్ హాలులో ముఖ్య శాఖల అధికారులతో సమీక్ష ఉంటుందని, సంబంధిత అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఓ ప్రకటనలో తెలిపారు.

News October 12, 2024

అనంత: విద్యుత్ షాక్‌కు గురై బాలుడి మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతిచెందిన ఘటన డీ.హీరేహల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. హీరేహల్‌కు చెందిన ఎర్రిస్వామి అనే బాలుడు గొర్రెలు మేపడానికి ఇంటి నుంచి వెళ్లారు. అయితే విద్యుత్ ట్రాన్స్‌ఫారం వద్ద స్టే వైరు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వెంటనే బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.