News December 29, 2024

ధర్మవరం నుంచి శబరిమలకు సైకిల్ యాత్ర

image

అయ్యప్ప స్వాములు ధర్మవరం నుంచి శబరిమలకు సైకిల్ యాత్ర చేపడుతున్నారు. పట్టణంలోని చెరువు కట్ట వద్ద ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి భజన మందిరం గురుస్వామి విజయ్ కుమార్ శిష్యులు 18 మంది సైకిల్‌పై అయ్యప్ప సన్నిధికి వెళ్తుండగా శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 5 గంటల యాత్ర ప్రారంభమవుతుందని గురుస్వామి తెలిపారు. సుమారు 788 కి.మీ ప్రయాణించి వారు శబరిమల చేరుకుంటారు.

Similar News

News November 2, 2025

రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి: కలెక్టర్

image

జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్‌లోని మినీ కాన్ఫరెన్స్ లో భారతీయ రెడ్ క్రాస్ సమైక్య అనంతపురం శాఖ కార్యకలాపాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రక్త కేంద్రాలలో సరిపడా రక్త నిల్వ ఉండేలా చూసుకోవడం ముఖ్యమైందని తెలిపారు.

News November 1, 2025

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

image

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. అనంతపురం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో త్రైమాసికంలో జరిగిన మాతా శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అనంతపురం రూరల్ కురుగుంట-2, యాడికి-1, రాయదుర్గం-1, కొర్రపాడు-1 UPHCలో జరిగిన మాతృమరణాలపై కలెక్టర్ ఆరా తీశారు.

News November 1, 2025

ఒకే ఇంట్లో ఆరుగురికి పింఛన్.. ₹36వేలు అందజేత

image

అనంతపురంలోని 26వ డివిజన్‌ హమాలీ కాలనీలో ఒకే ఇంట్లో ఆరుగురు దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. సయ్యద్ కుటుంబంలోని ఆరుగురు (సయ్యద్, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, మనుమడు) మూగవారు కావడంతో, వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున పింఛను మంజూరు చేస్తోంది. శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారందరికీ పింఛన్లను అందజేశారు. రూ.36వేలు అందించారు.