News January 27, 2025
ధర్మవరం: నూతన ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

ధర్మవరంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని కలెక్టర్ చేతన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను, పంపిణీ చేస్తున్న మందులపై వారు అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఈ నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవల గూర్చి, సమస్యల గూర్చి సూపర్డెంట్ మాధవి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా 21 మంది రోగులు డయాలసిస్ కోసం నమోదు చేసుకున్నారన్నారు.
Similar News
News February 18, 2025
బ్యాంకర్లు లక్ష్యాలను పూర్తి చేయండి: కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన రుణ మంజూరు లక్ష్యాలను 100% పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ పథకాల రుణ మంజూరుపై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
News February 18, 2025
బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిది: PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిదని, ఇది మరింత బలపడుతోందని తెలిపారు. అభివృద్ధి రాజకీయాలకు ఇది పెద్ద విజయం అని అభివర్ణించారు. GJలో 1912 వార్డులకు గాను బీజేపీ 1402, కాంగ్రెస్ 260, ఎస్పీ, ఆప్ కలిసి 236 వార్డులు గెలుచుకున్నాయి. 68 మున్సిపాలిటీల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 1, ఎస్పీ 2, ఇతరులు 3 చోట్ల విజయం సాధించాయి.
News February 18, 2025
చిత్తూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <