News April 30, 2024

ధర్మవరం: వడదెబ్బతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

ముదిగుబ్బ పట్టణం పాత ఊరికి చెందిన మోపూరి ప్రణీత్ కుమార్ (24) వడదెబ్బతో సోమవారం‌ మృతి చెందినట్లు అతడి కుటుంబీకులు తెలిపారు. ప్రణీత్ కుమార్‌కు ఆదివారం వడదెబ్బ తగలడంతో పరిస్థితి విషమించింది. చికిత్స నిమిత్తం బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రణీత్ మృతి చెందాడు. ప్రస్తుతం ప్రణీత్ కుటుంబ సభ్యులు అనంతపురంలో నివాసం ఉంటున్నారు.

Similar News

News October 21, 2025

సర్ధార్@150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయండి: కలెక్టర్

image

సర్ధార్ @150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో సర్ధార్ 150@ యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ పాదయాత్ర పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 31న నిర్వహించబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యువతీ, యువకులకు సూచించారు.

News October 21, 2025

‘రిజర్వేషన్ అమలులో మహా మోసం’

image

రిజర్వేషన్ల అమలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మహా మోసం జరిగిందని రిజర్వేషన్ సాధికార సమితి అధ్యక్షుడు జీవీ ఉజ్వల్ ఆరోపించారు. అనంతపురంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామకాలలో రిజర్వేషన్ కటాఫ్ కంటే ఓపెన్ కటాఫ్ తక్కువ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. జీవో 77లో ఓపెన్ క్యాటగిరీ పోస్టులు నింపిన తర్వాతే రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాలనే నిబంధన స్పష్టంగా ఉందన్నారు.

News October 21, 2025

గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ లభ్యం

image

అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో రెండేళ్ల బాబు ఇంటి నుంచి బయటికి వచ్చి తప్పిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్లూ కోట్ పోలీసులు, ఓ కానిస్టేబుల్ ఆ బాలుడి ఆచూకీ కనుక్కున్నారు. వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులకు ఎస్పీ అభినందించారు.