News March 24, 2024

ధర్మవరం MLA అభ్యర్థిగా సత్య కుమార్..?

image

పొత్తులో భాగంగా ధర్మవరం MLA అభ్యర్థిగా BJP జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై నేడో రేపో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే సీటును TDP నుంచి పరిటాల శ్రీరాం, బీజేపీ నుంచి వరదాపురం సూరి ఆశించారు. వైసీపీ అభ్యర్థిగా మరోసారి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి బరిలో దిగుతున్నారు. సత్యకుమార్‌ అయితేనే కేతిరెడ్డిపై గెలవగలరని భావించి ఆయన్ను బరిలో దింపుతున్నట్లు సమాచారం.

Similar News

News August 6, 2025

‘గ్రామ, వార్డు సచివాలయాలలో పెండింగ్ పనులు పూర్తి చేయండి’

image

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల అంశాలకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లో పంచాయతీ సెక్టార్, GSWS తదితర అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ సిటిజన్ ఫీడ్ బ్యాక్‌ను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు.

News August 5, 2025

కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మరో విశిష్ట గుర్తింపు

image

ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మరో విశిష్ట గుర్తింపు లభించింది. విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మిషన్ మాలవ్య ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంను విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ఏర్పాటు చేయడానికి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం వీసీ కోరి ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ఉన్నత విద్యా సంస్థల అధ్యాపకులకు ఆధునిక, నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రధాన వేదికగా పని చేయనుందన్నారు.

News August 5, 2025

‘బ్యాంక్, ఏటీఎం సెంటర్ల వద్ద HD కెమెరాలు అమర్చాలి’

image

బ్యాంకులు, ATM కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలు, సైబర్ నేరాల పట్ల కస్టమర్లను అప్రమత్తం చేయాలని బ్యాంకు అధికారులకు SP జగదీశ్ సూచించారు. అనంతపురంలోని ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని బ్యాంకు అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంక్, ATMల వద్ద 24X7 రికార్డు అయ్యే దృశ్యాలు క్లారిటీగా కనిపించేలా HD కెమెరాలను అమర్చాలన్నారు. వాటి డేటా క్లౌడ్ స్టోరేజీలో నిక్షిప్తం చేయాలన్నారు.