News April 10, 2025

ధర్మవరం: ‘YS జగన్ క్షమాపణలు చెప్పాలి’

image

YS జగన్ చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఖండించారు. బుధవారం ధర్మవరంలోని ఎన్జీ హోమ్‌లో వారు మాట్లాడుతూ.. వేలాది మంది కార్యకర్తలతో రాజకీయ సభలను తలపించే విధంగా తరలి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు 1200 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టామన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలన్నారు. ఈ వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు.

Similar News

News November 20, 2025

ములుగు: ‘స్వయం ఉపాధి వ్యాపారాలు చేయాలి’

image

గ్రామీణ ప్రాంత మహిళలు, యువకులు స్వయం ఉపాధి వ్యాపారాలు చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని జిల్లా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి అన్నారు. ములుగులోని సంక్షేమ భవన్‌లో పీఎం-ఈజీపీ పథకాలపై ఆహ్వాన కార్యక్రమం జరిగింది. చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడానికి, వ్యాపారాలు చేయడానికి ఈ పథకం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ముందుకు వస్తే రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.

News November 20, 2025

SKLM: ‘సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి’

image

సివిల్ సర్వీస్ ఉచిత కోచింగ్ పొందేందుకు నవంబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 80 ఫీట్ రోడ్డులో గల బీసీ స్టడీ కార్యాలయంలో ధ్రువపత్రాలను సమర్పించిన అనంతరం డిసెంబర్ 5న వెరిఫికేషన్ స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. కుల ప్రాతిపదిక పైన ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 10 నుంచి విజయవాడలోని గొల్లపూడి సర్కిల్లో ఉచిత కోచింగ్ ఇస్తారన్నారు.

News November 20, 2025

ఎన్టీఆర్ వైద్యసేవలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

image

డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ అమలులో నిర్లక్ష్యం వహించినా, చిన్న ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టరు కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన వైద్య సేవలు – జిల్లా క్రమశిక్షణా కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో కలసి కలెక్టర్ పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.