News April 10, 2025
ధర్మవరం: ‘YS జగన్ క్షమాపణలు చెప్పాలి’

YS జగన్ చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఖండించారు. బుధవారం ధర్మవరంలోని ఎన్జీ హోమ్‌లో వారు మాట్లాడుతూ.. వేలాది మంది కార్యకర్తలతో రాజకీయ సభలను తలపించే విధంగా తరలి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు 1200 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టామన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలన్నారు. ఈ వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు.
Similar News
News July 6, 2025
అనంతగిరిగా మార్చాలని డిమాండ్.. మీ కామెంట్ ?

వికారాబాద్ జిల్లాలో మరో కొత్త డిమాండ్ వినిపిస్తోంది. చుట్టు అడవి, గుట్టమీద అనంత పద్మనాభస్వామి కొలుదీరిన ప్రాంతానికి అనంతగిరి జిల్లాగా పేరు మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అనంతగిరి గుట్టల ప్రకృతి సోయగాలు, మూసీ నది జన్మస్థలం, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందటంతో జిల్లా పేరు మార్చాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై మీ కామెంట్.
News July 6, 2025
భద్రాద్రి రామయ్యకు స్వర్ణతులసి పూజలు

శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు శనివారం స్వర్ణతులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతం పలికి ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్యహోమాలు, నిత్యబలిహరణం తదితర నిత్యపూజలు చేశారు. స్వామివారి నిత్యకళ్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకువచ్చి నిత్యకళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News July 6, 2025
జులై 6: చరిత్రలో ఈరోజు

1901: భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జననం
1930: ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం(ఫొటోలో)
1985: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ జన్మదినం
1986: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం మరణం
2002: వ్యాపారవేత్త ధీరుభాయ్ అంబానీ మరణం