News December 7, 2024
ధర్మవరపు సుబ్రహ్మణ్యం అద్దంకి నియోజకవర్గానికి చెందిన వారే
తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. నేడు ఆయన వర్ధంతి. బల్లికురవ మండలం, కొమ్మినేనివారిపాలెంలో 1954లో జన్మించిన ఆయన అనారోగ్య కారణంగా 2013, డిసెంబర్ 7న మరణించారు. ఆయన ప్రాథమిక విద్యను తన స్వగ్రామంలో, 6 నుంచి 10వ తరగతి వరకు అద్దంకిలో చదివారు. ఒంగోలు CSR శర్మ కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసించారు.
Similar News
News December 27, 2024
పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ పకడ్బందీగా నిర్వహిస్తాం: ఎస్పీ
పోలీస్ కానిస్టేబుల్ ఎంపికను పకడ్బందీగా నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30 నుంచి ఒంగోలులోని పోలీసు పెరేడ్ మైదానంలో ఎంపిక ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు నిర్దేశించిన తేదీ, సమయాల్లో సర్టిఫికెట్లతో రావాలని చెప్పారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
News December 27, 2024
అభ్యంతరాలు ఉంటే 31లోపు తెలపండి: కలెక్టర్
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ జనాభా వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అన్సారియా శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. దీనిపై జిల్లాలోని ఎస్సీ పౌరులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు సచివాలయాల్లో అందించాలని తెలిపారు.
News December 26, 2024
ప్రకాశం: జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా పేరయ్య
జిల్లా మత్స్యకార సహకార సంఘానికి ఎన్నికలు గురువారం మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా గొల్లపోతు పేరయ్య, వైస్ ప్రెసిడెంట్గా కావేరి. రాములు, మరో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పేరయ్యకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.