News March 19, 2025

ధర్మారంలో ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు

image

ధర్మారం మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినందుకు గానూ సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రిని అధికారులు మంగళవారం రోజున సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ప్రసన్న కుమారి, వైద్య సిబ్బంది, పోలీసులు ఉన్నారు.

Similar News

News January 9, 2026

వేసవి సాగుకు అనుకూలం.. YLM 146 నువ్వుల రకం

image

ఆంధ్రప్రదేశ్‌లోని ఎలమంచిలి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం YLM 146 నువ్వుల రకాన్ని అభివృద్ధి చేసింది. ఇది వేసవి సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని పంట కాలం 90-95 రోజులు. హెక్టారుకు 8-10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల దీన్ని విడుదల చేశారు. పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగుకు ఈ వంగడాన్ని సిఫార్సు చేశారు.

News January 9, 2026

రెట్రో లుక్.. శ్రీలీల లేటెస్ట్ ఫొటోలు వైరల్

image

శ్రీలీల లేటెస్ట్ రెట్రో లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. శివకార్తికేయన్ ‘పరాశక్తి’లో నటించిన ఆమె ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తమిళనాడులో నిన్న జరిగిన ఈవెంట్‌‌లో ఆమె బ్లాక్ శారీ, జడలో గులాబీ పువ్వుతో కనిపించారు. దీంతో శ్రీలీల అలనాటి హీరోయిన్లను తలపిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పరాశక్తి రేపు విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా రాకపోవడంతో గందరగోళం నెలకొంది.

News January 9, 2026

కృష్ణా: కోర్టులో ముగిసిన వాదనలు.. నిందితుల బెయిల్‌పై ఉత్కంఠ!

image

సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ ముగిసింది. తేలప్రోలు రాము సహా నలుగురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై SC, ST కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. ఈ నెల 12న తుది తీర్పు వెలువరించనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. పటమట PS CC ఫుటేజ్ సమర్పణపై కూడా విచారణ పూర్తయింది. గత విచారణకు రాని వంశీకి కోర్టు సమన్లు జారీ చేస్తూ తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.