News April 29, 2024
ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు

TTD ఈవోగా మరో రెండు నెలలు పాటు ధర్మారెడ్డే కొనసాగనున్నారు. కేంద్ర రక్షణ శాఖ అధికారిగా ఉన్న ఆయన్ను డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చి EOగా నియమించారు. ఆయన డిప్యుటేషన్ మే 14తో ముగియనుంది. ఎన్నికల్లో ఐఏఎస్ అధికారులందరూ బిజీగా ఉంటారని.. ధర్మారెడ్డి డిప్యుటేషన్ గడువు పొడిగించాలని CM జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఈమేరకు ఆయన డిప్యుటేషన్ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
Similar News
News September 17, 2025
చిత్తూరు: ప్రియురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య

చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తవణంపల్లె మండలం దిగువమారేడుపల్లికి చెందిన దేవరాజులు(40) భార్య, పిల్లలను వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 9ఏళ్లుగా గంగన్నపల్లికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఏమైందో ఏమో మంగళవారం సాయంత్రం ఆమె ఇంట్లోనే అతను ఉరేసుకున్నాడు. మొదటి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ నెట్టికంటయ్య తెలిపారు.
News September 17, 2025
చిత్తూరు జిల్లా పర్యాటక అధికారిగా నరేంద్ర

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ ఏఎం నరేంద్రకు కీలక పదవి లభించింది. ఆయనను పర్యాటక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టూరిజం రంగంపై నరేంద్ర ఇప్పటివరకు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని అనేక శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు. విద్యారంగంలో విశేష అనుభవంతో పాటు సామాజిక రంగంలోనూ ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమించింది.
News September 16, 2025
TTD టోకెన్ల జారీలో మార్పు

TTD అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో మార్పు చేశారు. ఇప్పటివరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ఉండగా, ఇకపై లక్కీడిప్ పద్ధతిలో ఇవ్వనున్నారు. 3నెలల ముందుగా ఆన్లైన్ ద్వారా లక్కీ డిప్లో టోకెన్లు విడుదల చేస్తారు. డిసెంబర్ అంగప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోజూ 750 టోకెన్లు (శుక్రవారం మినహా) ఉంటాయి.