News September 5, 2024

ధవళేశ్వరంలో 10.90 అడుగులకు చేరిన నీటిమట్టం

image

గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు 10.90 అడుగులకు నీటిమట్టం చేరింది. 8,60,994 క్యూసెక్కుల వరద నీటిని కిందికి విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద ఉదయం 8.గంటలకు గోదావరి నీటిమట్టం 44.20 అడుగులకు చేరిందని క్రమంగా పెరుగుతోందని ఇరిగేషన్ అధికారులు దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

Similar News

News October 31, 2025

రాజమండ్రి: నవంబర్ 1 నుంచి స్వాభిమాన్ ఉత్సవాలు

image

బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గిరిజన స్వాభిమాన్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్టీ సంక్షేమ, సాధికారిత అధికారి కె.ఎన్. జ్యోతి తెలిపారు. గిరిజన సమాజ చరిత్ర, వారసత్వం, సాంస్కృతిక విలువలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబర్ 1న బిర్సా ముండా జ్ఞాపకార్థం మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

News October 31, 2025

రాజమండ్రి ఎంపీపై కేసు నమోదు చేయాలి: జేటీ రామారావు

image

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌజ్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.

News October 31, 2025

నవంబర్ 7న రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక

image

నవంబర్ 7న రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ సభ్యులంతా తప్పక హాజరు కావాలన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.